calender_icon.png 15 January, 2026 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న స్వామి గంగ తెప్ప ఊరేగింపు

15-01-2026 02:49:31 AM

ముషీరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ బకారంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి (మల్లన్న) ఆలయంలో బుధవారం గంగ తెప్ప ఊరేగింపు, ఒగ్గు పూజారిచే మల్లన్న జీవిత చరిత్ర భజన, స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, గొలుసులు తెంపుట తదితర పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ నల్లవెల్లి అంజిరెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో భోలక్ పూర్ డివిజన్  బీఆర్‌ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, శివ ముదిరాజ్, ఎ. శంకర్ గౌడ్, బల్ల ప్రశాంత్, వెంకటేష్, ప్రవీణ్, కేఎం సాయి, మల్లికార్జున్ రెడ్డి, కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.