23-11-2025 12:00:00 AM
పీజిపీఆర్ వ్యవస్థాపకుడు ఎంఎస్‌రెడ్డి
ఖైరతాబాద్ నవంబర్ 22 (విజయక్రాంతి) : వ్యవసాయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏసియన్ పి జి పి ఆర్ సొసైటీ వ్యవస్థాపకులు ఎంఎస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు డిసెంబర్ 3, 4 తేదీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హైదరాబాద్ లోని కన్హ శాంతి వనం హాట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ లో మహా కిసాన్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు, మాధవి, కృపాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి ఇందుకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు... ప్రస్తుత సమాజంలో రసాయనిక ఎరువుల వాడకం పెరిగిందని దానివల్ల నేల ఆరోగ్యం దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రైతులకు నేల ఆరోగ్యం పునరుద్ధర ణ, సేంద్రీయ వ్యవసాయం, నూతన పద్ధతులపై వ్యవసాయం చేయడం, రైతులు ఆర్థికం గా స్థిరపడడం, డిజిటల్ వ్యవసాయం, డ్రోన్ టెక్నాలజీ వంటి తదితర అం శాలపై ప్రజలకు అవగాహన కలిపిందేందుకు ఈ మెగా కిసాన్ మేలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ మేళాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది కి పైగా రైతులు, పాల్గొంటారని తెలిపారు.
వీరందరికీ ప్రకృతి వ్యవసా యం, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం పై నైపుణ్యం గల శాస్త్రవేత్తలతో ఇష్ట గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మేళాలో 100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కావున రైతులందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ మేళాను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఔ