02-05-2025 01:43:18 AM
సీఎంపై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ వ్యాఖ్యలు
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏ లో కాంగ్రెస్ లేదని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం చేపట్టబోతున్న కులగణన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి వా ్యఖ్యలపై స్పందిస్తూ డా.లక్ష్మణ్ గురువారం హైదరాబాద్‌లో మీడియా తో మాట్లాడారు. కులగణనకు కాం గ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో వ్యతిరేకమని తెలిపారు. ఆ పార్టీ గురించి రేవంత్‌రెడ్డి ఇంకా చాలా తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.
ఓబీసీలపై ఏఐసీసీ నేత రాహుల్, సీఎం రేవంత్‌రెడ్డి మొసలికన్నీరు కారుస్తున్నా రని ఆరోపించారు. ఓట్ల కోసమే తెలంగాణలో సర్వే చేపట్టారని ధ్వజమెత్తారు. చేసిన సర్వే వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. తాము ఎవరి ఒత్తిడికి తలొగ్గలేదని, కంటి తుడుపు చర్యగా తాము సర్వేలు చేయబోమన్నారు. సామాజిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కులగణనను చేపట్టబోతోందన్నారు.