calender_icon.png 12 September, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రఘురామ్ పిల్లరిశెట్టికి అరుదైన గౌరవం

12-09-2025 01:28:58 AM

-గ్లాస్గో రాయల్ కాలేజీ నుంచి గౌరవ ఫెలోషిప్ 

-ఈ ఘనత సాధించిన తొలి దక్షిణాసియా యువ శస్త్రవైద్యుడు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కిమ్స్ ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. బ్రిటన్‌లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ వారు ఆయనకు గౌరవప్రదమైన ఎఫ్‌ఆర్‌సిఎస్ (గ్లాస్గో) ను ప్రదానం చేశారు.

ఈ గౌరవం పొందిన దక్షిణాసియాలోని అతి పిన్న వయస్కుడైన శస్త్రవైద్యుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఇది మాత్రమే కాకుండా డాక్టర్ రఘురామ్ 1997లో ఇదే కాలేజ్ నుంచి ఎఫ్‌ఆర్ సిఎస్ (గ్లాస్గో) పరీక్ష ద్వారా అర్హత పొందారు. ఇప్పుడు అదే కాలేజ్ నుంచి గౌరవ ఫెలోషిప్ పొందిన ప్రపంచంలో ఏకైక శస్త్రవైద్యుడు అయారు. 425 ఏళ్ల పురాతనమైన గ్లాస్గో రాయల్ కాలేజ్ తరఫున, ఈ నెల 10న అదే కాలేజీలో కాలేజీ అధ్యక్షుడు ప్రొఫెసర్ హనీ ఎటీబా.. డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టికి ప్ర దానం చేశారు.

ప్రొఫెసర్ హనీ ఎటీబా మా ట్లాడుతూ.. డాక్టర్ పిల్లరిశెట్టికి తమ కాలేజ్ తరఫున అత్యున్నత గౌరవమైన హానరరీ ఫెలోషిప్ అందించడంలో ఎంతో ఆనందంగా ఉన్నదన్నారు. డాక్టర్ రఘురామ్ పిల్ల రిశెట్టి మాట్లాడుతూ.. “ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రదానం చేసినందుకు ఆర్సిపిఎస్జీ అధ్యక్షుడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రత్యేక గుర్తిం పును నా కుటుంబం, నా రోగులు, మరియు నా తల్లికి తండ్రికి ఈ నేలకి అంకితం చేస్తున్నాను” అని చెప్పారు.

కాగా డాక్టర్ రఘు రామ్ పిల్లరిశెట్టికి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన మరో 7 శస్త్రచికిత్స కళాశాలల నుండి హానరరీ ఫెలోషిప్లు ప్రదానం చేయబడ్డాయి. పద్మశ్రీ మరియు డాక్టర్ బి.సి. రాయ్ జాతీయ అవార్డు గ్రహీత అయిన ఆయన, బ్రిటన్ లోని మూడు శస్త్రచికిత్స రాయల్ కాలేజ్ల నుండి మరియు బ్రిటిష్ ప్రభుత్వ నుండి అత్యున్నత గౌరవాలు అం దుకున్న ఏకైక శస్త్రవైద్యుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన వ్యక్తి.

డాక్టర్ రఘురామ్ పిల్లరిశెట్టీ గత 18 సంవత్సరాలలో భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ చికి త్స రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఆయన దక్షిణాసియాలోని మొద టి సమగ్ర బ్రెస్ట్ హెల్త్ సెంటర్ ని స్థాపించి, దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అవగాహన పెంపొందించడానికి ఓ చారిటబుల్ ఫౌండేషన్ కూడా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రారంభించిన దక్షిణాసియాలోనే అతిపెద్ద జనాభాపరమైన స్క్రీనింగ్ కార్యక్కరమాలు ఆయన అమలు చేశారు.