calender_icon.png 12 September, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుద్రమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా చేస్తా

12-09-2025 01:27:57 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి , సెప్టెంబర్ 11: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి రుద్రమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా మార్చుటకు కృషి చేస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం వెలుగు పల్లి శివారులో గల రుద్రమ్మ చెరువును పర్యాటక అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి పురాతనమైన చెరువు అని, సుమారు 600 పై చిలుకు విస్తీర్ణతతో చెరువు నిండి ఉన్నదని, చెరువు మధ్యలో చెరువు పక్కల పెద్ద పెద్ద గుట్టలు ఆనుకొని ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి, పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు కృషి చేస్తా నని హామీ ఇచ్చారు. జాతీయ రహదారికి పక్కనే ఉన్నందువల్ల, రుద్రమ చెరువును తీర్చిదిద్దితే మరో లక్నవరంగా మారను న్నట్లు తెలిపారు.

చెరువులో బోటు, గుట్టల వద్ద స్టాల్స్‌తో అందంగా తీర్చిదిద్దే బాగుం టుందని అధికారులకు సూచించి, సంబం ధిత ఈడిఫోన్లో ఉపేందర్రెడ్డితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానందం, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్, ఎల్సోజి నరేష్, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల, మల్లేష్, దాసరి శ్రీను, కొండరాజు, మాచర్ల అనిల్, గంగరాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు జగదీష్‌రెడ్డికి లేదు

నాగారం, సెప్టెంబర్ 11 :  సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు జగదీష్ రెడ్డికి లేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు.  మండలంలోని ఫణిగిరి గ్రామంలో తోల్సూర్ బజార్ నుండి సూర్యాపేట _ జనగామ రహదారి వరకు దాదాపు రూ.30 లక్షల పైచిలుకు రోడ్డు పనులకు పార్మేషన్, సీసీరోడ్డు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డీ పేద ప్రజలు, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నార న్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగదీష్ రెడ్డి ని లిల్లీఫూట్ అనడాన్ని సమర్ధించారు.జగదీష్ రెడ్డివి అన్ని చిల్లర రాజకీయాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరం సహచర ఉద్యమకారులం అయినందున ఆయన గురించి  నాకు పూర్తి అవగాహన ఉంద న్నారు. జగదీష్ రెడ్డి నా పక్కన కూర్చోవడా నికి వణుకుతుండే, ప్రజలు వారి అవినీతిని చూసి సీఎం రేవంత్ రెడ్డిని సీఎం కూర్చిమీద కూర్చోబెట్టారన్నారు. ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని, ఆయనపై మాట్లాడే నైతిక హక్కు జగదీశ్ రెడ్డి కి లేదు.

ఉద్యమ కాలంలో నీకు ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు నీకు ఉన్న ఆస్తి ఎంత అని ప్రశ్నించారు.  రేవంత్ రెడ్డి వేగు చుక్క, ఆయన కళ్ళు తెరిస్తే మీరంతా జైలు పాలవుతారన్నారు. తదుపరి నాగారం ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. 

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తోడుసు లింగ య్య, సుంకరి జనార్ధన్ ,ఆకుల  బుచ్చిబాబు,  కడియం పరమేశ్, పానుగంటి నరసింహా రెడ్డి, ఎర్ర యాదగిరి, నాతి వీరమల్లు గౌడ్, కసిరెడ్డి రాంరెడ్డి ,బత్తుల కరుణాకర్,  రవి,  అవిలయ్య, రావుల సత్తయ్య,శేఖర్ రెడ్డి, యాట భాస్కర్, లక్ష్మీకాంత్,  వెంకన్న,  రమేష్, సురేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.