calender_icon.png 22 January, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కోట’ విద్యార్థి అరుదైన విజయం

22-01-2026 01:16:11 AM

నావిక విభాగంలో వినయ్ లెఫ్టినెంట్ ఉద్యోగం

336 పోస్టుల్లో తెలంగాణ నుంచి ఒక్కరికే అవకాశం

కరీంనగర్, జనవరి 21 (విజయక్రాంతి): కరీంనగర్‌లోని కోట జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థి కే వినయ్ కేంద్రీయ సర్వీసులకు చెందిన భారత నావికాదళంలో లెఫ్టినెంట్ ఉద్యోగానికి ఎంపిక అయ్యాడు. తమకు గర్వకారణమని కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 336 ఉద్యోగాలు భర్తీ చేయగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ఎంపికయ్యారని, అందులో తెలంగాణ నుంచి కే వినయ్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం అని ఆయన పేర్కొన్నారు. బుధవారం కోట విద్యాసంస్థల్లో కే వినయ్‌ను డాక్టర్ డి అంజిరెడ్డి అభినందించారు.