calender_icon.png 22 January, 2026 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ శాఖ దిద్దుబాటు చర్యలు

22-01-2026 01:02:24 AM

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం

నాగర్కర్నూల్, జనవరి 21 (విజయక్రాంతి):నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రా మంలో విద్యుత్ ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు ఎస్. లోకేష్ మృతి చెందిన ఘటనఫై విద్యుత్ శాఖ అ ధికారులు బుధవారం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రాష్ట్రస్థాయి వి ద్యుత్ అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ ప్రమాద ఘటనా స్థలి వద్ద ఆపరేషన్ డైరెక్టర్ ఎం.నర్సింలు, ఆపరేషన్ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ ఎం.బాలస్వామి, మేడ్చల్ చీఫ్ ఇంజనీర్ ఏ.కామేష్ స్థానిక విద్యుత్ అధికారులతో కలిసి పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ స్తంభానికి బిగించిన స్టే వైర్ను తాకడంతో షాక్ తగిలి మృతి చెందినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై విచారణ చేపట్టిన టీజీఎస్పీడీసీఎల్ అధికారులు, మృతుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా పరిహారాన్ని చెక్కు ద్వారా అందజేశారు.