calender_icon.png 22 November, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో రేవ్ పార్టీ భగ్నం

26-07-2024 05:05:51 AM

  1. డ్రగ్స్, మద్యం పట్టివేత 
  2. ఐదుగురిని అరెస్టు చేసిన ఎస్టీఎఫ్ పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): హైటెక్ సిటీలోని ఓ అపార్ట్ మెంట్‌లో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. గురువారం శేరిలింగంపల్లిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రదీ ప్‌రావు వివరాలు వెల్లడించారు. బేగంపేట కు చెందిన ఎ నాగరాజు యాదవ్ (31) అనే రియల్టర్ తన పుట్టినరోజు సందర్భంగా 14 మంది యువకులు, ఆరుగురు యువతుల తో సైబర్ టవర్స్ దగ్గరలోని క్లౌడ్ నైన్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో బుధవారం రాత్రి రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసు లు రేవ్ పార్టీపై దాడి చేశారు.

ఈ దాడుల్లో బేగంపేటకు చెందిన నాగరాజుతో సహా ఎ సాయికుమార్ యాదవ్ (27), టీ ఇమాన్యుయేల్ (20), బంజారాహిల్స్‌కు చెందిన చట్టి కిశోర్ (28), మోకెలకు చెందిన జీ నితిన్ (24)ను అరెస్టు చేశారు. మిగతా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఎక్సైజ్ అధికారులు నిందితుల నుంచి డ్రగ్స్, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాగరా జు  ఈ వేడుక కోసం ఈ నెల 12న గోవా నుంచి 3 గ్రాముల కొకైన్ తెచ్చి నితిన్‌కు ఇచ్చాడు. సాయికుమార్ యాదవ్ దుబాయ్ నుంచి విదేశీ మద్యాన్ని తీసుకువచ్చాడు.

కిశోర్ క్లౌడ్ 9 సర్వీ స్ అపార్ట్‌మెంట్‌ను బుక్ చేశాడు. కాగా ఎక్సై జ్ అధికారులు చేసిన తనిఖీల్లో నాగరాజు వద్ద 0.5 గ్రాముల కొకైన్, 0.84 గ్రాముల కుష్ డ్రగ్స్ లభించగా, ఇమాన్యుయేల్ వద్ద 0.5 గ్రాముల కొకైన్, నితిన్ వద్ద 2 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నా రు. వివిధ కంపెనీలకు చెందిన 12 లిక్కర్ బాటిళ్లు, 36 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.