calender_icon.png 17 November, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

17-11-2025 01:22:26 AM

-శివరాంపల్లిలో ఘటన

-రెండు లక్షల ఆస్తి నష్టం

రాజేంద్రనగర్, నవంబర్ 16 (విజయక్రాంతి) : శివరాం పల్లిలోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం లో ఎలాంటి ప్రాణాసనం జరిగనప్పటికీ సుమారు రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ఈ సంఘటన ఆదివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో జరిగింది.

బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శివరాంపల్లికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం కూడా భార్య ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండగా శివకుమార్ మరో సహాయకుడితో టిఫిన్ సెంటర్‌లో ఉండగా అకస్మా త్తుగా ఇంట్లో మంటలు చెలరేగటంతో శివకుమార్ మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూ కుటుంబ సభ్యులను బయటకు పంపించాడు.

షార్ట్ సర్క్యూట్‌తో ఏర్పడిన మంటలు ఇన్‌వర్టర్‌కు చేరుకొని మంటలు మరింత చెలరేగాయి. భయాందోళనతో శివకుమార్ తో పాటు చుట్టూ పక్కల వారు మంటలను అదుపు చేసేందుకు తీ వ్రంగా ప్రయత్నించినప్పటికీ మంటలు తీవ్రమయ్యాయి. అత్తాపూర్ పోలీ సులువెంటనే అత్తాపూర్ పోలీసులు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే సంఘటనకు చేరుకున్న పోలీస్ స్టేషన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అప్పటికే ఇంట్లోని గృహోపకరణలు, విలువైన వస్తు సామాగ్రి కాళీ బూడిదయ్యాయి. ఈ ప్రమాదంపై అత్తాపూర్ పోలీసులు సంఘటన చేరుకొని ప్రమాద పరిస్థితిలను నమోదు చేసుకున్నారు. ఈ ప్రమాదంలో బాధితుల శివకు మార్‌కు స్వల్ప గాయాలయ్యాయి.