17-11-2025 01:24:34 AM
మిర్యాలగూడ, నవంబర్ 16 (విజయ క్రాంతి): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బీసీల న్యాయసాధన దీక్ష విజయవంతం చేయాలని యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ పిలుపునిచ్చారు.
సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థ ల ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
లేదంటే బీసీలను అణిచివేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీక్షకు కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నాయకులు తమ్మడ బోయిన అర్జున్, ఎండి సలీం , పగిడి రామలింగయ్య యాదవ్, దశరథ్, పోలగాని వెంకటేష్ గౌడ్, జక్క నాగేశ్వరరావు, సిద్ధం రాజు, రవీందర్ గౌడ్, ఉపేందర్, గంగాధర్ తదితరులు మద్దతు తెలిపారు.