calender_icon.png 17 November, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్త్రీ పెట్టెలో బంగారం బిస్కెట్లు

17-11-2025 01:25:38 AM

-శంషాబాద్ విమానాశ్రయంలో రూ.1.55 కోట్ల విలువజేసే బంగారం పట్టివేత

-షార్జా నుంచి వచ్చిన ఇద్దరు అరెస్ట్

శంషాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలి స్తున్నారన్న సమాచారంతో డీఆర్‌ఐ అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్ర యంలో శనివారం అర్ధరాత్రి నుంచి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణి కునిపై అనుమానంతో ఎయిర్‌పోర్టులోనే హోటల్‌లో అదు పులోకి తీసుకొని అతని లగేజీని తనిఖీ చేయగా ఇస్త్రీ పెట్టెలో బంగారం బిస్కెట్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి, ఇస్త్రీపెట్టెలో ఉన్న రూ.1.55 కోట్ల విలువైన 1.11 కిలోల బంగారం బిస్కెట్లను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశారు.