calender_icon.png 21 December, 2025 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని మంత్రి పొన్నంకు వినతి

21-12-2025 12:00:00 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి  బాగ్లింగంపల్లిలోని భగత్ సింగ్ నగర్ నివాసులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్  హైదరాబాద్ కలెక్టర్ హరి చందనకు ఫోన్ లో మాట్లాడి సమస్యలు వెంటనే పరిష్కరించి నాకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ, శంకర్ ముదిరాజ్, దామోదర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి  ప్రభాకర్, కళ్యాణ్ నాయక్, నితిన్, బస్తీ వాసులు లింగమయ్య, శీను, రాములు, సురేష్, వినయ్, గాలయ్య, శాంత తదితరులు పాల్గొన్నారు.