calender_icon.png 21 December, 2025 | 7:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం కళ్లు తెరిచి రిజర్వేషన్లు కల్పించాలి

21-12-2025 12:00:00 AM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

ముషీరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో బీసీల ఘన విజయంతో ఐనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోపైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి నిన్న జూబ్లీహిల్స్, నేటి సర్పంచ్ ఎన్నికలలో వేలాది చోట్ల డిపాజిట్లు కోల్పో యి కేవలం ఐదు శాతం ఓట్లకి పరిమితమైనా బుద్ధి రాదా? అని ప్రశ్నించారు.

జనాలను ఎన్నికల మత్తులో ఉంచి ఎంపీటీసీ, జడ్పిటిసి,  ఎంపిపి, మున్సిపల్, కార్పొ రేటర్, కౌన్సిల్ ఎన్నికలు జరిపి 42 శాతం ఎగరగొట్టాలనే కుట్రలు ఇంకా కొనసాగిస్తే శాశ్వతంగా కనుమరుగు కాక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాగుల శ్రీనివాస్ యాదవ్, పి.సతీష్, నాగు నరేష్, అరుణ్, బాలకృష్ణ, బోయ గోపి, బి.వై.శ్రీకాంత్, పి.రాజ్ కుమార్, యశ్వంత్ రావ్, రాములు పాల్గొన్నారు.