10-10-2025 12:29:07 AM
58 మందికి కోర్టు శిక్షలు: ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, అక్టోబర్ 9 (విజయక్రాంతి): జిల్లాలో మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలకు ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ ప్రధాన కారణమవుతున్నారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కొన్నిసార్లు మద్యం సేవించి వాహనం నడిపినవారు స్వయంగా ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతుండగా, ఎన్నో కుటుంబాలు దాని వల్ల రోడ్డున పడుతున్నాయని తెలిపారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కామారెడ్డి జిల్లా పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన వాహనదారులను కోర్టులో ప్రవేశపెట్టి, న్యాయమూర్తుల ఎదుట హాజరు పరచడం ద్వారా జైలు శిక్షలు , జరిమానాలు విధించడం జరుగుతోందన్నారు.గురువారం జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు మొత్తం 58 మందికి శిక్షలు విధించిందన్నారు.
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మందికి జైలు శిక్ష (4 మందికి 2 రోజుల జైలు, 6 మందికి 1 రోజు జైలు శిక్ష ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తికి 2 రోజుల జైలు వెయ్యి రూపాయల జరిమానా విధించారు.మాచారెడ్డి, కామారెడ్డి, బిక్నూరు పోలీస్ స్టేషన్లలోఒక్కొక్కరికి 1 రోజు జైలు వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం రోడ్డు ప్రమాదాల నివారణ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ తెలిపారు.