calender_icon.png 10 October, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చల్మెడలో బేబి కిట్ పథకం ప్రారంభం

10-10-2025 12:28:17 AM

కొత్తపల్లి, అక్టోబరు 9 (విజయ క్రాంతి): నగరంలోని చల్మెడ ఆనందరావు హాస్పిటల్ లో గురువారం చల్మెడ బేబీ కిట్ పథకాన్ని ఆసుపత్రి చైర్మన్ చల్మెడ లక్ష్మీనరసింహరావు ప్రారంభించారు. బేబి కిట్లను తల్లులకు అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడు తూ చల్మెడ కిట్టులో శిశువుకు బట్టలు, నూ నె, సబ్బులు, దోమ తెర, బేబి బెడ్డు అవసరమైన ఇతర వస్తువులుఉంటాయని తెలిపా రు.

చల్మెడలో జన్మించిన శిశువుకు నెల రోజుల వరకు ఉచితంగానే టీకాలు వేయనున్నట్లు ప్రకటించారు. గర్భం దాల్చిన తేది నుంచి ప్రసవం వరకు ఉచిత మందులు పరీక్షలులతో సహ, ఉచిత వైద్య సేవలతో పాటు ప్రతి నెల బాగోగులు తమ వైద్యులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని తెలిపారు. జిల్లా లోని గర్భిణీలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్ర మంలో వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి సూర్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ అసీమ్ అలీ, సూపరిం డెంట్ డాక్టర్ డివి రామకృష్ణ ప్రసాద్, డ హెచ్ ఓ డి డాక్టర్ వి రమాదేవి, డాక్టర్ మాధవి, డాక్టర్ కవిత, డాక్టర్ అంజుమాన్ బానో, డాక్టర్ ప్రశాంత్, ఏవో డాక్టర్ శ్రవణ్, తదితరులుపాల్గొన్నారు.