31-01-2026 01:18:29 AM
ఎకనామిక్ సర్వేను స్వాగతిస్తున్నాం
క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్- ఎలెక్ట్ జగన్నాథరావు బండారి
హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): భారతదేశ పట్టణ, ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్రను పునరుద్ఘాటించిన ఎకనామిక్ సర్వే 2025 క్రెడా య్ హైదరాబాద్ స్వాగతించింది. ఈ సర్వే ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2026లో జీడీపీ వృద్ధి 7.4%గా ఉంటుందని అంచనా. దీనికి బలమైన స్థిర మూలధన రూపకల్పన (దాదాపు 30% జీడీపీ), 9.1% వృద్ధిని నమో దు చేస్తున్న సేవా రంగం, 4.8% వద్ద ఉన్న ద్రవ్యలోటు వంటి అంశాలు మద్దతుగా నిలుస్తున్నాయి.హైదరాబాద్ వృద్ధిలో నగరం లోపల జనసాంద్రత పెరగడం,శివారు ప్రాంతాల వేగవంతమైన విస్తరణ రెండూ సమాంతరంగా సాగుతుండటం విశేషం. ఇది నివాస, వాణిజ్య విభాగాల్లో ఉన్న భారీ డిమాండ్‌ను సూచిస్తోంది.
ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాల ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రం గాలు 9.9% వృద్ధిని సాధించాయి. అలాగే నిర్మాణ రంగం 7.4% వృద్ధిని నమోదు చేసింది.. ఇది గృహనిర్మాణం, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల ప్రభావాన్ని చూపుతోంది. ఎకనామిక్ సర్వేపై క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్- ఎలెక్ట్ జగన్నాథరావు బండారి మాట్లాడుతూ ‘హైదరాబాద్‌ప్రత్యేకమైన వృద్ధి పథాన్ని ఎకనామిక్ సర్వే చక్కగా వివరించింది అని పేర్కొన్నారు. నగరం లోపల అభివృద్ధి, శివారు ప్రాంతాల విస్తరణ ఏకకాలంలో జరుగుతున్నాయి.
ఈ జోరును కొనసాగించాలంటే భూమి, రవాణా, మౌలిక సదుపాయాల పరంగా ఉన్న అడ్డంకులను తొలగించాలి. పారదర్శకమైన నిబంధనలు, విశ్వసనీయమైన పాలన ద్వారా ఇది సాధ్యమవుతుంది అని ఆయన అన్నారు. ‘పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉండటం వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని సర్వే చేసిన అంచనాతో క్రెడాయ్ హైదరాబాద్ ఏకీభవిస్తోందన్నారు. గృహనిర్మాణ రంగానికి అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక సహాయం, క్రెడిట్ గ్యారెంటీలు, పెట్టుబడి రిస్క్ తగ్గించే చర్యలు చేపట్టాలని కోరారు.
కేంద్ర బడ్జెట్ 2026పై అంచనాలు.. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల నిధులు, పీఎంఆర్‌వై 2.0 కి మద్దతు, సింగిల్-విండో క్లియరెన్స్, సరసమైన ధరల గృహనిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని క్రెడాయ్ ఆశిస్తోంది అని తెలిపారు. పన్ను సంస్కరణలపై స్పం దిస్తూ గృహ కొనుగోలుదారుల కోసం హోమ్ లోన్లపై ఆదాయపు పన్ను మినహాయింపులను పెంచాలని, ఎన్పీఎస్ తరహా పన్ను ప్రయోజనాలను హౌసింగ్ ఫైనాన్స్‌కు కూడా వర్తింపజేయాలని, స్టాంప్ డ్యూటీలను హేతుబద్ధీకరించాలని క్రెడాయ్ హైద రాబాద్ విజ్ఞప్తి చేస్తోంది. భారతదేశం $5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో హైదరాబాద్ పాత్రను మరింత బలోపేతం చేసే విధానాల కోసం ఎదురుచూస్తోంది.