31-01-2026 01:16:24 AM
కరీంనగర్ హాస్పిటల్‌లో రోగికి మెడ నరముల ప్లాస్టిక్ సర్జరీ
హైదరాబాద్, జనవరి 30(విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ గ్రామా నికి చెందిన నర్సింహులుకి గతంలో దురదృష్టవశాత్తు ఆక్సిడెంట్ జరగడం వల్ల మెడ నరాలు చిట్లిపోయి కుడి చేయి పూర్తిగా పనిచేయడం లేదు. ఈ సమస్యను బ్రేకియల్ ప్లెక్సస్ ఇంజురీ అని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సమస్యకు క్లిష్టమైన, అత్యంత నైపుణ్యంతో కూడిన శస్త్ర చికిత్సలు నిమ్స్ హైద రాబాద్‌లో మాత్రమే చేస్తారు. అయితే అటువంటి సర్జరీని రోగికి కరీంనగర్‌లోని కెల్విన్ హాస్పిటల్‌లో విజయవంతం చేశారు.
ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్లు రామ్ ప్రభు, సురేష్ కుమార్ చింత, త్రివిక్రమ్‌ల బృందం 8 గంటలు కష్టపడి సర్జరీని విజయవంతం చేశారు. మన కరీంనగర్‌లోని కెల్విన్ హాస్పిటల్‌లో ఇంత అరు దైన సర్జరీ జరగడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. తక్కువ ధరలో విజయవంతంగా సర్జరీ చేయడం పట్ల రోగి బంధువులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.