01-10-2025 12:09:43 AM
మాగనూరు సెప్టెంబర్ 30 దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మాగనూరు మండల కేంద్రంలోని శ్రీ కాళికామాతకు పంచమృతాభిషేకం, ప్రత్యేక పూ జలు మహా మంగళహారతి నిర్వహించారు, అనంతరం దేవాలయ ఆవరణలో లలిత సహస్రనామ పఠనం, మహిళలు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాళికాదేవి మాతకు గ్రామంలోని వివిధ కుటుంబాల మహిళలు నూతన వస్త్రాలతో అమ్మవారికి ఓడి నింపే కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. సాయంత్రం ఆలయ ఆ వరణలో వివిధ రకాల పూలతో తయారుచేసిన బతుకమ్మను తయారుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకల సందర్భంగా కోలాటం భజన నృత్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు ఆలయ పూజారి గ్రామ పెద్దలు తదితరులుపాల్గొన్నారు.