calender_icon.png 1 October, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి విలువైన గంజాయి పట్టివేత

01-10-2025 12:08:41 AM

  1. ఒకరు అరెస్టు.. పరారీలో ముగ్గురు
  2. ఏపీలోని చింతూరు నుంచి హర్యానాకు రవాణ
  3. మొరంపల్లి బంజర గ్రామం వద్ద పట్టుకున్న బూర్గంపాడు పోలీసులు

బూర్గంపాడు,సెప్టెంబర్ 30,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామ శివారు వద్ద రూ.1,02,46,500 విలువైన 204 కిలోల 930 గ్రాముల గంజాయిని బూర్గంపాడు పోలీసులు సోమవారం పట్టుకున్నారు.స్థానిక పోలీస్ స్టేషన్‌లో పాల్వంచ సీఐ కె.సతీష్ మంగళవారం వివరాలు వెల్లడించారు.

ఏపీ రాష్ట్రంలోని చింతూరు నుంచి హర్యానాకు హెచ్‌ఆర్ 33బీ 6330 మారుతి కారులో హర్యానా రాష్ట్రానికి చెందిన సంజీవ్ కుమార్ అక్రమంగా గంజాయి తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు బూర్గంపాడు ఎస్‌ఐ ప్రసాద్ తన సిబ్బందితో మొరంపల్లి బంజర గ్రామ శివారు వద్ద వాహన తనిఖీల్లో భాగంగా కారును ఆపి తనిఖీ చేయగా 204.930 కిలోల గంజాయి దొరికింది.కారు ఓనర్ ప్రిన్స్ కుమార్ ఆదేశాల ప్రకారం చింతూరు వెళ్లి అక్కడ ప్రధాన్ ఖారా, లఖన్ హంతాల్ వద్ద గంజాయి లోడ్ చేసుకొని తిరిగి హర్యానా వెళుతుండగా పట్టుబడినట్లు తెలిపారు.

గంజాయితో పాటు వాహనాన్ని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ప్రిన్స్ కుమార్, ప్రధాన్ ఖారా, లఖన్ హంతాల్ లు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో బూర్గంపాడు ఎస్‌ఐ మేడా ప్రసాద్,అదనపు ఎస్‌ఐ నాగభిక్షం,ట్రైనీ ఎస్‌ఐ దేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.