26 March, 2026 | 1:35 AM

బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం

26-03-2026 12:01 AM

సామాజికవేత్త బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ 

దేవరకొండ, మార్చి 25: బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం అని సామాజికవేత్త బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్  అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు.  అనంతరం ఈ మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందించి అసెంబ్లీలో ఆమోదానికి సిద్ధం చేస్తున్నారు అని పేర్కొన్నారు.

ఎస్సీల మాదిరిగా రక్షణ చట్టం కావాలని తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే వెనుకబడిన కులాలకు ప్రత్యేక పరిరక్షణ చట్టం అవసరం వడ్డెర, పిచ్చకుంట్ల, బుడబుక్కల చాలా కులాల సంచార జాతులుగా జీవిస్తున్నాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద సరియైన కుల గణాంకాలు లేకపోవడం వల్ల సమాజంలో అసమానతలు దాడులు జరగడం వల్ల స్వేచ్ఛగా జీవించేటటువంటి పరిస్థితి లేదు అని అన్నారు.  ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, పున్న బిక్షమయ్య ,గిరి, ఆరె కంటి శ్రీనివాస్ గౌడ్ , చిట్టిపోలు వెంకన్న , భీమా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.