26 March, 2026 | 1:36 AM

నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

26-03-2026 12:02 AM

ఎలాంటి వదంతులను నమ్మవద్దు : పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడి

నిజామాబాద్ మార్చ్ 25: (విజయక్రాంతి): జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత లేదని  నిజామాబాద్ జిల్లా పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ , ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతోందన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని , సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పడిన పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. 

షల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, ఏ రకమైన నిర్ధారణ లేని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని పోలీస్ కమీషనర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని , వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపడితే , సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.