calender_icon.png 10 November, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి

10-11-2025 12:05:32 AM

అలంపూర్ నుంచి హైదరాబాద్‌కు న్యాయవాదుల పాదయాత్ర 

అలంపూర్, నవంబర్ 9: దేశవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేకమైన చట్టం తేవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జోగుళాంబ దేవస్థానం నుంచి హైదరాబాద్ వరకు మహా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయవాదులు మాట్లాడుతూ..ప్రస్తుత సమాజంలో న్యాయవాదులపై భౌతిక దాడులు నిత్యం ఏదో ఒక చోట జరుగుతున్నాయని అన్నారు.

న్యాయవాదుల రక్షణ చట్టం కోసం పాదయాత్రను చేపట్టామని ఈ పాదయాత్ర దాదాపు పది రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు రూ.5,000 రూపాయలు స్ట్రుఫైండ్, న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు, సిఆర్ పిసి సెక్షన్ 41 (ఏ) బిఎన్‌ఎస్ సెక్షన్ 35(1) సవరణ చేయాలని డిమాండ్ చేశారు.హైదరాబాద్ చేరుకుని రాష్ర్ట గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జిలకు తమ సమస్యలను విన్నవించి వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లంపూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గవ్వల శ్రీనివాసులు, నారాయణరెడ్డి తిమ్మారెడ్డి శ్రీధర్ రెడ్డి గజేంద్ర గౌడ్ ఆంజనేయులు మధు వెంకటేష్ హేమంత్ యాదవ్, యాకూబ్, రామాంజనేయులు, నాగయ్య బలిగెర ఉషన్ తదితరులు పాల్గొన్నారు. 

న్యాయవాదులకు పలువురు మద్దతు 

అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి, సిట్టింగ్ స్టేట్ బార్ మెంబర్ హనుమంత్ రెడ్డి , మహబూబ్ నగర్ సీనియర్ న్యాయవాది ఎన్ పీ వెంకటేష్, జగన్మోహన్ రెడ్డి , కంచుపాడు మాజీ సర్పం స్టేషన్ గౌడు