calender_icon.png 10 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు చలి తీవ్రత

10-11-2025 12:06:40 AM

9 రోజులు బలమైన చలిగాలులు  

వెల్లడించిన వాతావరణ శాఖ

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రజలను చలి తీవ్రత పట్టేస్తోంది. పగటిపూట వేడిగా ఉన్న వాతావరణం సాయంత్రం 5 గంటలు దాటిన వెంటనే చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ నివేదికల ప్రకారం మంగళారం నుంచి ఈ నెల 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

దీంతో నవంబర్ 13 నుంచి 17 వరకు చలి తీవ్రత గరిష్ట స్థాయిలో ఉండబోతుందని నిపుణులు హెచ్చరించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ స్థాయికి (10 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపు ) పడిపోవచ్చని అధికారులు తెలిపారు.

అలాగే హైదరాబాద్ సహా ఇతర జిల్లాలలో ఉదయం ఉష్ణోగ్రతలు 11డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 14 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వృద్ధులు, చిన్న పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.