11-09-2025 12:00:00 AM
‘మహావతార్: నరసింహ’ ఇటీవల ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిం దో చూశాం. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ అలాంటి మరో సినిమా రాబోతోంది. అదే ‘వాయు పుత్ర’. ఇదొక యానిమేషన్ మూవీ. చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.
ఈ సినిమాతో హనుమంతుడి కాలాతీత కథను గొప్ప దృశ్యకావ్యంగా 3డీ వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన, ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసాన్ని సంగ్రహిస్తుంది’ అంటూ మేకర్స్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమ వుతున్న లంకను చూస్తున్నట్టు ఈ పోస్టర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.