calender_icon.png 2 January, 2026 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్మనీలో మల్కాపూర్ విద్యార్థి మృతి

02-01-2026 01:33:43 AM

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. కిందకు దూకడంతో తలకు తీవ్రగాయాలు

జనగామ(మహబూబాబాద్),జనవరి 1(విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్ రెడ్డి ప్రమాదవశాత్తు మరణించాడు. హృతిక్ రెడ్డి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించగా, ప్రాణ రక్షణ కోసం తాను కిందకి దూకడంతో తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించినట్లు సమాచారం.

హృతిక్ రెడ్డి మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఇటీవల మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఇద్దరు యువతులు అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించగా, తాజాగా హృతిక్ రెడ్డి మర ణంతో విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లల తల్లిదండ్రులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందో ళన చెందుతున్నారు.