02-01-2026 01:33:04 AM
సికింద్రాబాద్ జనవరి 01 (విజయ క్రాంతి) : న్యూ బోయినపల్లి మేడ్చల్ ఎమ్మె ల్యే చామకూర మల్లారెడ్డి క్యాంపు కార్యాలయం లో డిసెంబర్ 27,28 లో కరీంనగర్లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లో సత్తా చాటిన మేడ్చల్ జిల్లాకు చెందిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ సభ్యుల బృందం అధ్యక్షులు,వెటరన్ క్రీడాకారుడు మర్రి లక్ష్మణ్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మర్రి లక్ష్మణ్ రెడ్డి కరీంనగర్ లో నిర్వహించిన ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ లోని వాకింగ్, రన్నింగ్,జావలిన్ త్రో,లాంగ్ జంప్,హై జంప్ వంటి భాగాలలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను పరిచయం చేయగా మల్లారెడ్డి క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేసి,శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ అథ్లెటిక్స్ మనలోని మానసిక ధైర్యాన్ని పెంపొందించడంతో పాటు శారీరకధృఢత్వాన్ని పెంపొందిస్తాయని, క్రీడాకారులు జాతీయ,రాష్ట్ర స్థాయి లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారుఅన్ని ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రత్నకుమార్, శ్రీలక్ష్మి, లక్ష్మణ్ రావు, కోశాధికారి డి.లక్ష్మీ, ప్రభు గౌడ్, మాస్టర్ గేమ్స్ విజేతలు (పురుషులు): గోపీనాథ్ రెడ్డి, డి.నాగేశ్వరరావు, జంగం దత్తాత్రి, పొట్టి రాజు,సుధాకర్, ఎన్. రాంరెడ్డి,నాగభూషణం, ద్వారకానాథ్, సుధీ ర్ రాజం,రవీందర్ రెడ్డి,వర్మీషా, హర్షవర్ధన్,సుశీల్ గౌడ్.మాస్టర్ గేమ్స్ విజేతలు (మహిళలు): వై. స్నేహలత రెడ్డి,పద్మిని,రాజరాజేశ్వరి, భవాని,రాఘవ కుమారి,సిహెచ్ విజయలక్ష్మీ, శ్రీదేవి, జి.సుకన్య పాల్గొన్నారు..