19-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి
భూత్పూర్, ఆగస్టు 18 : ఎడతెరిపి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ భూత్పూర్ మండలం లో గోపన్న పల్లి, పోతుల మడుగు గ్రామాల మధ్యలో వరద నీరు ప్రవహించడం తో గోపన్న పల్లి గ్రామం రాక పోకలకు స్తంభించిన నేపథ్యం లో కలెక్టర్ వరద నీటిని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గ్రామస్థులు మాట్లాడుతూ ప్రతిసారి వర్షాల వల్ల వరదలు రావడం ఇబ్బందిగా ఉంది అని రెండు ఊర్లకు రాకపోకలు ఇబ్బంది అవుతున్నావని తెలిపారు.. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని కలెక్టర్ గ్రామస్తులకు సూచించారు. బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని కలెక్టర్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. దివిటిపల్లి గ్రామ పరిధిలో అమర్ రాజా కంపెనీ వద్ద తెగిన రోడ్డును మరమ్మతులు పరిశీలించారు. దివిటిపల్లి చెరువు ను పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో Along with MPDO, Tahsildar Kishan Naikతదితరులు పాల్గొన్నారు.