calender_icon.png 21 May, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లింట తీవ్ర విషాదం!

21-05-2025 01:07:24 AM

  1. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు

నలుగురు మృతి, 30 మందికి గాయాలు

మరో ఇద్దరి పరిస్థితి విషమం

విందుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం

వికారాబాద్ జిల్లా రంగాపూర్ వద్ద ఘటన

చేవెళ్ల, మే 20: పెళ్లింట తీవ్ర విషాదం నిండింది. విందుకు వెళ్లి ట్రావెల్ బస్సులో తిరిగి వస్తుండగా ఆగిఉన్న లారీని ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతు ల్లో కుటుంబ పెద్ద అల్లుడు, మేనల్లుడు, అత్త తో పాటు మరో ఇద్దరు దగ్గరి బంధువులు ఉన్నారు. దీంతో నాలుగు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద మంగళవారం జరిగింది. షాబాద్ మండలం చందనవెల్లి గ్రామానికి చెందిన మంగళి రామస్వామి కొడుకు సతీశ్‌కు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణానికి చెందిన మంగలి రామకృష్ణ కుమార్తెతో ఈ నెల 16న వివాహం జరిగింది. 18న చేవెళ్ల మండలం అల్లవాడలో విందు నిర్వహించా రు.

తర్వాత ఆనవాయితీ ప్రకారం సోమవారం పెళ్లి కూతురు ఇంటి వద్ద చిన్న విందు ఉండటంతో చందనవెల్లితో పాటు బంధువులను దాదాపు 34 మందిని తీసుకొని ట్రావె ల్ బస్సులో వెళ్లారు. విందు ముగించుకొని సోమవారం రాత్రి 12 గంటల సమయంలో తిరుగుపయణమయ్యారు. పరిగి మండలం రంగాపూర్ వద్దకు రాగానే డ్రైవర్ యూసుఫ్ బస్సును అతివేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఉన్న సిమెంట్ లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. చికిత్స కోసం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ముగ్గురు మృతి చెందారు.

చనిపోయి న వారిలో రామస్వామి అల్లుడు (కూతురు భర్త) సీతారాంపురం గ్రామానికి చెందిన మల్లేశ్, అత్త(భార్య తల్లి) షాబాద్ మండలం చిన్నసోలిపేటకు చెందిన బాలమణి(60),   మేనల్లుడు (చెల్లెలి కొడుకు) ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్‌కు చెందిన సందీప్ (26), మరో బంధువు చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన హేమలత (30) ఉన్నారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడగా పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు.

ఇందులో కార్తీక్, మోక్షిత పరిస్థితి విషమంగా ఉండటంతో కార్తీక్‌ను గాంధీ ఆస్ప త్రికి, మోక్షితను నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారలో వారిలో యూ సుఫ్, రవీందర్, మంజుల, రాములు, అజయ్‌శ్రీ, శ్రీజ, శ్రీవాణి, సాహితీ, ప్రణీత, శ్రీనిధి, యాదమ్మ, లక్ష్మయ్య, నరేష్, రాకేశ్, సురేందర్, నీరజ, హరిత, లక్ష్మీ, రమేష్,  సాత్విక్, మహేష్, నవనీత, అరుణ, సుజాత, మమత, సుజాత, ప్రియాంక ఉన్నారు.

వీరిలో 14 మంది వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఇషా ఆస్పత్రికిలో చికిత్స పొందు తున్నారు. మంగలి నరసింహులు ఫిర్యా దు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఎస్సై సంతోష్‌కుమార్ తెలిపారు.

విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం ఉదయం వికారాబాద్‌లోని ఇషా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, కొంత ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఉండగా ఉంటుందని, అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు.

లారీని తాటిపత్రితో కప్పడంతోనే ప్రమాదం ?

రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలో సిమెంట్ లోడ్ ఉంది. సిమెంట్ వర్షానికి తడిసిపోతుందేమోనని డ్రైవర్ లారీ ఇండికేటర్స్, రేడియం కనిపించకుండా తాటిపత్రిని కప్పాడు. అంతేకాదు లారీ సగభాగం రోడ్డుపై సగభాగం పార్కింగ్ ఏరియాలో ఉంచాడు. దీంతో ఇండికేటర్, రేడియం కనిపించలేదు. ఇది గమనించకపోవడంతో ట్రావెల్ బస్సు డ్రైవర్ లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.