calender_icon.png 21 May, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

21-05-2025 01:00:33 AM

  1. మరోమారు పునరావృతం కావొద్దు 

జిహెచ్‌ఎంసి పరిధిలో సీఎం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయాలి 

గుల్జార్ హౌస్ మృతుల సంతాప సభలో ఎంపీ ఈటల రాజేందర్ 

ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు 

రాజేంద్రనగర్, మే 20 : పాతబస్తీలోని గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాదంలాం టి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరి పించాల్సిన అవసరం ఉంద ని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఇటీవల అగ్ని ప్రమాద ఘటన లో మృతి చెందిన మోదీ అగర్వాల్ కుటుంబ సభ్యుల సంతాప సభకు ఆయన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో హాజరై నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. చార్మినార్ గుల్జర్ హౌస్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి 17 మంది చనిపోవడం యావత్ సమాజాన్ని కలిచివేసిందని తెలిపారు. అగ్ని ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎన్ని గంటలకు ఫోన్ వెళ్ళింది, ఎప్పుడు రెస్క్యూ సిబ్బంది వచ్చారు.. అనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలకు, వివక్షకు ఆస్కారం లేకుండా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

చార్మినార్, బేగంబజార్, ఓల్ సిటీలో నిర్మాణాలు చాలా ఏళ్ల క్రితం కట్టినవి కావడంతో ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం చూడాలని ఈ సందర్భంగా ఈటల విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఫైర్ డిపార్ట్మెంట్, వైద్య సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నానన్నారు. ఒకటే కుటుంబంలో 17 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇలాంటి సంఘటనలు, దుఃఖం మరొకరికి రాకూడదు అంటే ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ బిజెపి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.