19-05-2024 01:59:50 AM
యాదాద్రి భువనగిరి, మే18 (విజయక్రాంతి) : యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం శనివారం భక్తులతో సందడిగా మారింది. ప్రత్యేక దర్శనం, ధర్మదర్శనం క్యూలైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు. దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం పట్టినట్టుగా భక్తులు తెలిపారు. ఆలయంలో వేకువజామున స్వామివారికి సుప్రభాత సేవ, బాలబోగం, అభిషేకం అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవ మండ పంలో నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణం ఘనంగా నిర్వహించారు.
అలరింంచిన సంగీత కార్యక్రమం
యాదగిరి కొండపై ప్రతి శనివారం భక్తులను ఆహ్లాదపరచడానికి ఏర్పాటు చేస్తున్న ధార్మిక, సాహిత్య, సంగీత కార్యక్ర మాల్లో శనివారం సాయంత్రం భక్తి సంగీతం ప్రేక్షకులను అలరింపచేసింది. కుమారి ఊర్జిత పటేల్ భక్తి సంగీత గానం చేశారు.
నిత్యాదాయం రూ. 51.82 లక్షలు
స్వామివారికి ఆదాయం రూ. 51,82,41లక్షల ఆదాయం వచ్చినట్టు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,04, 550, కైంకర్యాల ద్వారా రూ. 2,200, సుప్రభాత దర్శనాల ద్వారా రూ. 22,600, బ్రేక్ దర్శనాల ద్వారా రూ. 3,90,900, వ్రత పూజల ద్వారా రూ. 2,73,600, వాహన పూజల ద్వారా రూ. 9,400, వీఐపీల దర్శనాల ద్వారా రూ. 8,55,000, ప్రచార శాఖ రూ. 38,700, పాతగుట్ట ద్వారా రూ. 43,940, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా 6,00,000, యాదరుషి నిల యం రూ. 2,55,234, సువర్ణ పుష్పా ర్చనల ద్వారా రూ. 1,19,148, శివాల యం ద్వారా రూ. 12,300, పుష్కరిణీ ద్వారా రూ. 1,600, ప్రసాదాల విక్ర యం ద్వారా రూ. 18,86,640, కల్యాణకట్ట ద్వారా రూ. 1,46,000, ఆలయ పునరుద్ధరణ నిధి రూ. 6,400, లాకర్స్ రూ. 480, లీజెస్ రూ. 1,16,286, అన్నదానం ద్వారా రూ. 63,153 ఆదాయం సమకూరినట్టుగా పేర్కొన్నారు.