11-12-2025 01:40:06 AM
గాంధారి, డిసెంబర్ 10 ( విజయక్రాంతి): రైతులు చీడ పురుగుల నుంచి పంటలను రక్షించుకోవాలనీ మండల వ్యవసాయ అధికారి రాజలింగం అన్నారు. ఈ మేరకు బుధవారం రోజున గాంధారి మండలం లోని బ్రాహ్మణపల్లి శివారు లోని మొక్కజొన్న పంటలను పరిశీలించారు.పంట పరిశీలన లో భాగంగా యాసంగి కాలంలో నీటి లభ్యత తక్కువగా ఉంటుంది కావున నీటిని వృధా చేయకుండా తడులవారీగా మొక్కజొన్నకు నీరు అందించాలని ఆయన సూచించారు.
అలాగే మొక్కజొన్న పంటలో చీడపురుగుల బెడద ఉన్నట్లయితే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తద్వారా తగు సూచనల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు అనంతరం గుర్జాల్ గ్రామంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి వెంటనే వరి కొనుగోలు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మొదలైనవారు పాల్గొనడం జరిగింది.