22-05-2025 01:34:54 AM
సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా
న్యూఢిల్లీ, మే 21: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ ఖండించింది. ఈ ఎన్‌కౌంటర్‌తో పాటు ఆపరేషన్ కగార్‌పై న్యాయవిచారణ జరిపించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డీ రాజా బుధవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మావోయిస్టు నాయకుడి ఆచూకీ గురించి అధికారులకు తెలిస్తే చట్టపరంగా ఎందుకు అరెస్టు చేయలేదని అందులో ప్రశ్నించారు. ఈ హత్యలు ప్రమాదకరమైన హింసను, ఆదివాసీల అణచివేతను సూచిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్యాయంపై దేశ ప్రజలంతా గళమెత్తాలని పేర్కొన్నారు.