22-05-2025 01:35:49 AM
న్యూఢిల్లీ, మే 21: వక్ఫ్ అనేది ఇస్లామిక్ భావనే కానీ ఇస్లాంలో భాగం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నా రు. వక్ఫ్ సవరణ చట్టంపై దాఖలైన వ్యతిరేక పిటిషన్లకు సంబంధించిన విచారణ బుధవారం కూడా కొనసాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవా య్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాస ం రెండోరోజు వక్ఫ్ సవరణ చట్టంపై విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక ట్రస్ట్ అని, చారిటీ సంస్థ అని పేర్కొన్నారు. అలాంటి చారిటీ సంస్థకు ముస్లిం మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఇస్లామిక్ భావ నగా మా త్రమే ఉందని, అంతమాత్రానా ఇస్లాంలో భాగం కాదని పేర్కొన్నారు. దేశం లో 140 కోట్ల మంది ప్రజలను, వాళ్ల ఆస్తు ల్ని సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని తెలిపారు.
ప్రజల ఆస్తులను అక్రమంగా పక్కదారి పట్టించే ప్రయ త్నాలను సర్కారు చూస్తూ ఊరుకోదన్నారు. ప్రతి మతంలోనూ ధానధర్మాలు ఉన్నాయని.. ఒక్కో మతానికి ఒక్కో విధానం ఉం టుందన్నారు. ప్రభుత్వ భూములపై ఎవరికీ హక్కు లేదని, ఆస్తులను ప్రభుత్వం కాపాడుకోగలదని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు ఉన్నది సేవ కోసమని, బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులు ఉంటే వచ్చే నష్టం ఏంటని ప్రశ్నించారు.
ఇందులో మతపరమైన అం శాల జోక్యమేమి లేదన్నారు. వక్ఫ్ చట్టం సవరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పా టు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏకంగా 96 లక్షల మంది ముస్లింలను కలిసిందన్నారు. సుదీర్ఘ చర్చోపచర్యల తర్వాతే అందరి సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకొని కేంద్రం చట్టాన్ని సవరించిందన్నారు.
1923 నుంచి కొనసాగుతున్న సమ స్యలకు శాశ్వత పరిష్కారం చూపించినట్టు కేంద్రం తన వాదనలో స్ప ష్టం చేసింది. అనంతరం విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది.