19-09-2025 12:00:00 AM
మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్‌తో సహా పలువురి పరామర్శ
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తండ్రి నలమాద పురోషోత్తంరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నివాళులు అర్పించారు. గురువారం పురోషోత్తం రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, శాసన సభాపతి ప్రసాద్‌రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వివేక్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తదితరులు హాజయ్యారు.