31-01-2026 12:29:00 AM
బోధన్ జనవరి 30 (విజయ క్రాంతి): రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఆవరణలో శుక్రవారం రక్త పింజర పాము కలకలం సృష్టించింది. పామును చూసిన విద్యార్థులు ఎమ్మెల్యే ఎత్తిపోయారు. పాఠశాల ఆవరణలో చెట్లు, పొదలు, గడ్డితో కూడుకుని పాఠశాల చుట్టూ అపరిశుభ్రంగా ఉండటంతో పాములు తిరుగుతూ ఉంటాయని, అక్కడున్న స్థానికులు పామును పట్టుకుని వేరే చోటుకి వదిలిపెట్టారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంటనే స్పందించి పాఠశాల ఆవరణలో పెరిగిన చెట్లు, పొదలను తొలగించి శుభ్రం చేయించాలని విద్యార్ధినుల తల్లిదండ్రులు కోరారు.