calender_icon.png 31 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చివరి రోజు అట్టహాసంగా నామినేషన్లు

31-01-2026 12:27:47 AM

ఉమ్మడి జిల్లాలో 8 వేలు దాటిన నామినేషన్లు

కరీంనగర్, జనవరి 30 (విజయ క్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. నామినేషన్ల పరిశీలన అనంతరం జాబితాను ఆదివారం ప్రకటిస్తారు. 3వ తేదీ వరకు ఉపసంహరణకు గ డువు ఉంది. ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు చివరి రోజున భారీ ప్రదర్శనలతో నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ మం త్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పలు డివిజన్లలో పర్యటించి అభ్యర్థుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అల్గునూర్ లో నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు పలు డివిజన్లలో ప్రదర్శనగా తరలివచ్చారు.

నియోజకవర్గ ఇంచా ర్జి వెలిచాల రాజేందర్రావు, నగర పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు ప్రదర్శనలో పా ల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులు పలుచోట్ల భారీ బల ప్రదర్శనలు నిర్వహించారు. కరీంనగర్ లో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి నంజయ్ కుమార్ ను కలిసి ఆశీస్సు లు కోరారు. మాజీ మేయర్ సునీల్ రావు నామినేషషన్లు దాఖలు చేసి సంజయ్ కు మార్‌ను కలిశారు. కీలకమైన టవర్ ప్రాం తంలో గతంలోనే బీజేపీలో చేరిన వంగల ప వన్‌కు మద్దతుగా కలిసికట్టుగా పార్టీ శ్రేణులు టవర్ ప్రాంతంలో బలప్రదర్శనలు చేశారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ 24వ డివిజన్‌లో ఇటీవల పార్టీలో చేరిన రఘునాథరావుతో కలిసి ప్రదర్శన నిర్వహించి హనుమా న్ దేవాలయంలో పూజలు చేశారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్ నగరపాలక సంస్థ, రామగుండు నగరపాలక సంస్థతోపాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి, రాయికల్, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల పరిధిలో అభ్యర్థులు భారీ ర్యాలీలు ని ర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆయా నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి గేట్ వద్ద అభ్యర్థులను మాత్రమే లోనికి పంపించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. బీ ఫాంల సమర్పణ శని వారం కూడా ఉండడంతో ఆయా పార్టీల ఆ శావహులు టికెట్ల కోసం నేతల వద్దకు పరుగులు తీశారు.

నామినేషన్ల దాఖలు సమ యం మధ్యాహ్నం 3 గంటల వరకే అయినప్పటికీ ఆ సమయం వరకు లోనికి వచ్చిన వారికి అనుమతి ఇచ్చారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. ఈ మూడు రోజు ల్లో ఉమ్మడి జిల్లాలో 8 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చాలాచోట్ల రెబల్స్ తో పాటు తెలంగాణ జాగృతి నుంచి పోటీకి దిగుతున్నవారు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ల వేటలో పడ్డారు. అలాగే కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలో ఎంఐఎం టికెట్ల కోసం కార్యాలయం వద్దకు క్యూ కడుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో నామినేషన్ల ఉపసంహరణ 3వ తేదీ అనంతరం ప్రచారం ఊపందుకోనుంది.

కాంగ్రెస్ కు మ ద్దతుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొ న్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విప్ ఆది శ్రీనివాస్ తోపాటు ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు క్యాంపెయినర్లుగా వ్యవహరించనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజ య్ కుమార్ బడ్జెట్ సమావేశాల నుంచి మినహాయింపు పొందేలా ఎన్నికల కోసం ప్రత్యేక అనుమతి తీసుకుని ఇక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. బీఆర్‌ఎస్ నుండి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ తోపాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ప్రచార రంగంలో దిగనున్నారు.