calender_icon.png 30 January, 2026 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్యాచ్ పనులు పూర్తి చేయాలి

29-01-2026 12:00:00 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): వివి గిరి నగర్ బస్తీలో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు వెంటనే పూర్తి చేయాలని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గాంధీనగర్ డివిజన్ లోని వివి గిరి నగర్ బస్తీలో ఇటీవల పూర్తున నూతన మంచినీటి, సివరేజి పైప్ లైన్ పనుల అనంతరం రోడ్డు ప్యాచ్ వర్క్ పనులు పూర్తి కాలేదన్న సమస్యను గిరి నగర్ బస్తీ వాసులు కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు బుధవారం కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ జలమండలి అధికారులు డీజీఎం కార్తీక్ రెడ్డి, మేనేజర్ కృష్ణ మోహన్, సిబ్బంది, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్ తో కలసి బస్తీలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి కుమార్, సాయికిరణ్ యాదవ్, విజయ లక్ష్మి, బస్తీ వాసులు నర్సింగ్‌రావు, సి. సాయి కుమార్, హన్మంత్ రావు పాల్గొన్నారు.