15-05-2025 12:00:00 AM
ముషీరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటాలని, ఈ మేరకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆప్ జాతీయ నాయకులు తెలంగాణ రాష్ట్ర బాద్యులు, మాజీ ఎమ్యెల్యే దిలీప్ పాండే సూచించారు.
ఢిల్లీ ఆప్ కేంద్ర కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ల ఎన్నికలు - అనుసరించవలసిన వ్యూహా లు, పార్టీ బలోపితం పై ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్, ఆప్ రాష్ట్ర నాయకులు విజయ్ మల్లంగి, మహమ్మద్ సోహైల్ లాతో దిలీప్ పాండే చేర్చించారు.
ఈ తెలంగాణాలోని అన్ని జిల్లాలలో ఆప్ శాఖలు బలంగా ఉన్నాయని, ఈసారి జెడ్.పి.టి.సి స్థానాలతో పాటు ఎంపీటీసీ గ్రామాల్లో సర్పంచ్, వార్డ్ మెంబర్ పదువులకు పోటీ చేయాలనీ దిలీప్ పాండే కోరారు. దేశానికి ప్రమాదకరంగా మరి న బీజేపీని తెలంగాణ లో చిత్తూ చేయాలనీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత దేశ ప్రజలు ఇచ్చిన హామీలను ప్రచారం ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చెప్పారు.
తెలంగాణాలో ఆప్‌కు కొంత పట్టు ఉన్న దానిని మరింత పటిష్టం చేసుకోవాలన్నారు. మారిన పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీచేస్తామన్నారు.
ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు రూపొందించిందని, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల మే 31 న ఆప్ యాక్టీవ్ వాలం టీర్లు రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ లో పెద్దఎత్తున నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ఆప్ శ్రేణులు హాజరౌతారని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు.