28-07-2025 12:18:34 AM
మిర్యాలగూడ జూలై 27 (విజయక్రాంతి): మాజీ రాష్ట్రపతి,శాస్త్రవేత్త, మిస్త్స్రల్ మెన్ ఏపీజే అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శప్రాయుడని ప్రముఖ సామాజికవేత్త జడి రాజు,బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్,బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్,దాసరాజు జయరాజులు అన్నారు.
ఆదివారం ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడలోని మేరెడ్డి రాంచంద్రారెడ్డి గ్రంథాలయంలో ఆయన చిత్రపటానికి పూలదండ వేసి మాట్లాడారు. ప్రపంచ మేధావిగా,మిస్త్స్రల్ మెన్ గా అనేక రకాల అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఆయుధాలను తయారు చేయించి దేశానికి అందించారని అన్నారు. అబ్దుల్ కలాం నిత్య విద్యార్దిగా అనేక అంశాలు తెలుసుకొని యువతను సన్మార్గంలో నడిపించారని గుర్తు చేశారు.
దేశవిదేశాలలో నూతన విధానాలు,ఆవిష్కరణలు చేసి యువత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కార్యదర్శి జక్క నాగేశ్వర్ రావ్ యాదవ్ ,బీసీ నాయకులు నేతినేటి వెంకన్న యాదవ్, శ్రీను నాయక్,దుర్గయ్య,అనిల్,సునీల్,సైదులు,రవి,శివ చరణ్ రెడ్డి,సతీష్, వినయ్ పాల్గొన్నారు.