26-01-2026 01:58:39 AM
సికింద్రాబాద్, జనవరి 25 : దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడంతో పాటు ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో నిర్వహిస్తున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2026 ఉత్సాహంగా సాగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ మీడియా క్రికెట్ లీగ్ రెండోరోజు పోటీలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి, ఏబీవీ ఫౌండేషన్ ఛైర్మన్ కావ్య కిషన్‌రెడ్డి హాజరయ్యారు. విజయక్రాం తి, హెచ్‌ఎంటీవీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను తిలకించి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
మ్యాచ్ అనంతరం ఇరు జట్ల సభ్యులకు ఏబీవీ ఫౌండేషన్ తరపున సర్టిఫికెట్లను అం దజేశారు. ప్రతీ ఒక్కరూ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యతనివ్వాలని, వార్తా సేకరణలో బిజీగా ఉన్నప్పటకీ పని ఒత్తిడి నుంచి ఉపశమనంగా అప్పుడప్పుడు ఇలాంటి టోర్నీలు ఆడాలని కావ్యా కిషన్‌రెడ్డి సూచించారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో ఐన్యూస్ జట్టుపై సుమన్ టీవీ 60 పరుగులు తేడాతో విజయం సాధించింది. అలాగే నాంపల్లి వారియర్స్ వాకోవర్ ఇవ్వడంతో మ్యాచ్ ఆడకుండానే సనత్ నగర్ టైగర్స్ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పీఆర్వో పరమేశ్ పాల్గొన్నారు.