calender_icon.png 24 May, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామదూత స్వామిజీ పూజా కార్యక్రమంలో అభిమన్యురెడ్డి

12-05-2025 02:29:04 AM

జడ్చర్ల మే 11 : పట్టణంలో బిఆర్‌ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దత్తఅవధూత భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామిజీ గారి శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మీ పూజ మరియు అష్టలక్ష్మీ కలశపూజ, సిద్ది వ్రత దీక్ష విరమణ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ యువనేత శ్ చించోడ్ అభిమన్యు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

అనంతరం అభిమన్యు రెడ్డి  మాట్లాడుతూ  శ్రీ వేణుదత్త స్వామి, అష్టలక్ష్మీ అమ్మవార్ల దయతో, భగవాన్ శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్చర్ల స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.