13-08-2024 04:09:04 PM
హైదరాబాద్: అధికారుల అవినీతిపై ఏసీబీ డీజీ సివి. ఆనంద్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అవినీతి అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకోలేరని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీకి చిక్కడం ఖాయమని డీజీ సివి. ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం లంచం తీసుకుంటూ పట్టుబడిన రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ ఘటనే ఇందుకు నిదర్శనం అని సివి ఆనంద్ అన్నారు. ఇద్దరిని పట్టుకోవడంతో ఏసీబీ బృదం చాకచక్యంగా పనిచేసిందన్నారు. ఇద్దరి నుంచి రూ.8 లక్షల నగదును స్వాధినం చేసుకున్నామని, ఇవాళ ఉదయం జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి రూ.16 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు డీజీ సివి. ఆనంద్ వెల్లడించారు. ఇద్దరిని అరెస్టు చేసి బంజారాహిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.