02-05-2025 01:32:42 AM
రాజేంద్రనగర్, మే 1: నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేట్‌లో ఉన్న మూవీ టవర్‌లో గురు వారం రాత్రి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ అధికారి ఖాజా మొయి నొద్దీన్ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీ విషయంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన ఎన్నో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆయన కొన్ని రోజుల క్రితం దుబా య్ పారిపోయాడు. తిరిగి వచ్చాడని పోలీసులకు విశ్వసనీయ సమా చారం అందడంతో అధికారులు గు రువారం రాత్రి ఆయన ఇంట్లో సో దాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వా ధీనం చేసుకున్నట్లు సమాచారం.