02-05-2025 01:30:53 AM
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
సంగారెడ్డి, మే 1(విజయక్రాంతి) :ఈనెల 4వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాలలో 3320 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, మధ్యాహ్నం 2 - 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్ష కేంద్రంలోనికి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని అన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 125 బీఎన్‌ఎస్‌ఎస్ (144) సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఆలస్యం కాకుండ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా జెన్టీయు, ఐఐటీ, కేవీ స్కూల్ ఓడిఎఫ్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ వెంట సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, జోగిపేట్ సిఐ అనిల్ కుమార్, సంగారెడ్డి రూరల్ క్రాంతి కుమార్ ఉన్నారు.