calender_icon.png 4 November, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల విస్తరణ జరగకపోవడం వల్లనే ప్రమాదాలు..

03-11-2025 10:44:09 PM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): రోడ్ల విస్తరణ లేకపోవడం వల్లనే బస్సు ప్రమాదం జరిగిందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి(Puligari Govardhan Reddy) అన్నారు. ఈ మేరకు సోమవారం కవాడిగూడలో పులిగారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశ్చిమ భాగం అభివృద్ధికి ఆమడ దూరం ఉండడం బాధాకరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలకు కారణమన్నారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రమాదాలను అరికట్టాలని డిమాండ్ చేశారు.