17-01-2026 12:25:11 AM
మహబూబాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): వాహనదారులు ట్రాఫిక్ నిబంధ నలను ఉల్లంఘించడం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ప్రతి వాహనదారుడు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ కోరారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్ర మంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని పేర్కొంటూ, ఇం దుకోసం పోలీస్ ఉద్యోగులు ముందుగా రో డ్డు భద్రత నియమాలను పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ట్రా ఫిక్ రూల్స్ కచ్చితంగా పాటిస్తామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రోడ్డు భద్రత పోస్టర్ ఆవిష్కరించారు.