21-05-2025 01:04:43 AM
గజ్వేల్‌లో విలేకరుల సమావేశంలో ఏఏం సి చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి
గజ్వేల్ మే 20: బిఆర్‌ఎస్ నాయకులు ఉనికి కాపాడుకోవడానికి ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం తగదని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ ఏఏం సి సమావేశ మందిరంలో వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రైతులు బాగుంటేనే అందరూ బాగుంటారు అని నమ్మి రైతు పండించిన ప్రతి వడ్లగింజను సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కార్ కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేయడంతో పాటు రైతు ఖాతాల్లోకి డబ్బులు కూడా వేగంగా జమ చేస్తున్నట్లు తెలిపారు.
రైతులకు లాభం చేకూర్చే ఉద్దేశ్యం ఉంటే చక్కని సలహాలు ఇవ్వాలని, అంతేగాని గతంలో కన్నా వేగంగా జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను తప్పు పట్టడం సరికాదన్నారు. వడగళ్ల వాన పలుచోట్ల కురిసిన సందర్భాల్లో ఆలస్యం జరిగిందే తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో పటిష్టంగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయన్నారు.
రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నించడం ప్రతాపరెడ్డికి తగదన్నారు. గజ్వేల్ మండలంలో ఐకేపి ద్వారా 8 కొనుగోలు కేంద్రాలలో 1202 నంది రైతుల నుండి 53,340 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 660 మంది రైతులకు రూ. 7. 07 కోట్ల డబ్బులను చెల్లించడం జరిగిందన్నారు.
పిఎసిఎస్ ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు 10 కేంద్రాల్లో ఇప్పటివరకు 610 మంది రైతుల నుండి, 32,662 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడంతోపాటు రైతులందరికీ రూ. 7.57 కోట్ల మొత్తాన్ని చెల్లించినట్టు తెలిపారు. ఇదే విధంగా అన్ని మండలాల్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో ఏం సి డైరెక్టర్లు కర్ణాకర్ రెడ్డి, నర్స గౌడ్, యాదగిరి, ఏఏం సి కార్యదర్శి జాన్ వెస్లీ, ఏపిఎం దుర్గాప్రసాద్, పిఎసిఎస్ సిబ్బంది బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, నాయకులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.