21-05-2025 01:04:35 AM
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెంటనే సానుకూల స్పందన
అబ్దుల్లాపూర్‌మెట్, మే 20: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎక్స్ప్రెస్ హైవేపై తర్వలో రెండు ఎలివేటర్ వంతెన నిర్మాణా లు అందుబాటులోకి రానున్నాయి. రంగారెడ్డి జిల్లా, పెద్ద అంబర్‌పేట్, లక్ష్మా రెడ్డిపా లెం ఈ రెండు చోట్ల వంతెన నిర్మాణానికి కో సం కేంద్ర రోడ్ల, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి భువనగరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి లేఖ రాశారు.
ఎంపీ చామల విజ్ఞ ప్తి మేరకు సమస్య తీవ్రత, ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత విభాగాల అధికారులకు ఎలివేటర్ వంతెన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. అదే విధంగా అతి త్వ రలో ఈ అంశంపై కార్యాచరణ చేపడతామ ని కేంద్ర మంత్రి హామీవ్వడం జరిగింది. ఎం పీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కేంద్ర మం త్రికి రాసిన లేఖను సంబంధిత అధికారులకు స్థానిక తాజా మాజీ కౌన్సిలర్లు అందజే శారు.
అనంతరం వారు మాట్లాడుతూ...పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో ఇటీవల వేగం గా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త గా 100కు పైగా కాలనీలు వెలిశాయన్నారు. రోడ్ల విస్తర్ణలో భాగంలో ఇరువైపుల గ్రిల్స్ ఏర్పాటు చేయడం వలన ప్రజలు నానా ఇ బ్బందులకు గురవుతున్నారని తెలిపారు. విజయవాడ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే వలన రహదారి దాటడం ప్రజలకు ప్రమాద కారణంగా మారిందన్నారు.
ముఖ్యంగా వృద్ధు లు, చిన్నారులు, మహిళలు రహదారి దాటే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యల పరి ష్కారానికి రెండు ఎలివేటర్ వంతెనలు నిర్మించాలన్నఎంపీకి విన్నవించగా.. వారు సంబంధిత కేంద్రమంత్రి లేఖ రాశారని..
వారు వెంటనే సానుకూలంగా స్పదించారన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డికి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీలకు ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదలు తెలుపుతు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దంకి కృష్ణారెడ్డి, పసుల రాజేందర్, దండెం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.