02-12-2025 01:14:55 AM
డీసీపీ భాస్కర్ వెల్లడి
దండేపల్లి (లక్షెట్టిపేట టౌన్), డిసెంబర్ 1 : జిల్లాలోని దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలిక మిస్సింగ్, హత్య కేసును దండేపల్లి పోలీసులు సోమ వారం చేదించి నింధితులను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ విలేకరులతో మాట్లాడుతూ బాలిక మిస్సింగ్, హత్య కేసు వివరా లను వెల్లడించారు.
దండేపల్లి మండలం నంబాల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బ్యాండ్ పని చేసుకుంటూ జీవించే శనిగారపు బాపు భార్య ఆరేండ్ల కిందట చనిపోయింది. తన కూతురు, కొడుకు కూడా అతన్ని వదిలేసి ఉంటున్నారు. ఇదే కాలనీకి చెందిన ఉపారపు సతీష్‌కి ఐదేండ్ల కిందట పెండ్లి జరుగగా రెండు సంవత్సరాల తర్వాత తన భార్యతో విడాకులయ్యాయి.
నవంబర్ 24న వీరిద్దరు కలిసి భయట చింతచెట్టు కింద ఆడుకుంటున్న చిన్నారి మహాన్వితని నోరు మూసి ఎత్తుకొని దగ్గరలోని పత్తి చేనులో ఒకరి తర్వాత ఒకరు అత్యా చారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబుతుందనే భయంతో చిన్నారి గొంతు నొక్కి చంపి తర్వాత పక్కనే ఉన్న కొక్కెర హరీష్ వ్యవసాయ బావిలో పడేశారు. నవంబర్ 27న శవం భయటకు తేలడంతో మిస్సిం గ్, హత్య కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో అత్యాచారం చేసి చిన్నారిని చంపి బావిలో పడేసిన శనిగారపు బాపు, ఉపారపు సతీష్‌లు పోలీసులకు చిక్కకుండా ద్విచక్ర వాహనంపై పారిపోతుండగా సోమ వారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్ళతో పాటు బట్టలు ఇతర వస్తువులతో పాటు బాధితురాలి రెండు గాజులు, ఒక పట్టా గొలుసు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.
మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కేసును చేదించిన లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్ ఐలు తైసినుద్దీన్ (దండేపల్లి), సురేష్ (లక్షెట్టిపేట), అనూష (జన్నారం)లతో పాటు హెడ్ కానిస్టేబుళ్లు గౌస్, గంగ నాయక్, వసంత్, జహీర్, ఆనంద్, కానిస్టేబుళ్లను ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు.