19-08-2025 12:36:40 AM
అశ్వాపురం, ఆగస్టు 18,(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మం డలం , ఎలకలగూడెం గ్రామంలోని ఇసుకవాగు వరదల కారణంగా పొంగిపొర్లి గ్రా మాల మధ్య రాకపోకలను పూర్తిగా నిలిచిపోయాయి. వేములూరు, మనుబోతులపాడు వంటి గ్రామాలకు వెళ్లే మార్గం కూడా స్తం భించిపోయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.మాజీ సర్పంచ్ కలేటి నరసింహరావు సోమవారం మాట్లాడుతూ ఈ వాగుపై శాశ్వత బ్రిడ్జి నిర్మాణం కోసం ఎన్నోసార్లు అధికారులను, ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐదు సంవత్సరాల క్రితం ఈ వాగులో ఒక వ్యక్తి మృతి చెం దినా, సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో 100 శాతం గిరిజన జనాభా ఉండి, ఇంకా స్వాతంత్య్రం వ చ్చిన 79 ఏళ్ల తర్వాత కూడా అభివృద్ధి వెలుగులు అందలేదని స్థానికులు ఆవేదన చెం దుతున్నారు. వైద్య అత్యవసరాలు, ప్రసవాలు, జ్వరాలు, వ్యవసాయ పనుల విష యంలో ప్రజలు ప్రతిరోజూ వాగు దాటడం తప్పదని వారు చెప్పారు.
గ్రామస్తుల తరఫున అధికారులను ఉద్దేశించి నరసింహరా వు స్థానిక శాసనసభ్యులు, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి, అశ్వాపురం ఎమ్మార్వో, ఎంపీడీవో లు తక్షణమే స్పందించి, వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలి అని విజ్ఞప్తి చేశా రు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బుర్కా నారాయణ, కలేటి గోపాలరావు, బుర్కా శ్రీ ను గుమస్తా, కొండ్రు సాంబశివ రాజు, బు ర్కా సర్వేష్, ఎసమ్ విజయ్, తాటి శివాజీ, సోడే జస్వంత్, కుంజ వరుణ్ తదితరులుపాల్గొన్నారు.